దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ
Daggubati Multi Starrer Movie May Start Soon. అక్కినేని వారి కుటుంబంలోని హీరోలంతా కలిసి నటించిన చిత్రం 'మనం'
By Medi Samrat
అక్కినేని వారి కుటుంబంలోని హీరోలంతా కలిసి నటించిన చిత్రం 'మనం'. విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సమంత నటించారు. చక్కని కథతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తన కుటుంబంలోని కథానాయకులు అందరినీ కలిసి ఓ సినిమా నిర్మించాలనేది డి.రామానాయుడు కల. అయితే.. సరైన కథ లభించక అది ఆయన జీవించి ఉండగా.. కార్యరూపం దాల్చలేదు. ఆయన మరణాంతరం అతడి తనయుడు డీ సురేష్ బాబు వెంకటేష్-నాగచైతన్య కాంబోలో 'వెంకీమామ' అంటూ సూపర్ హిట్ అందుకున్నారు
అయితే.. ఆయన కుటుంబంలోని హీరోలంతా కలిసి ఓ చిత్రం రాలేదు. తాజాగా.. శతమానం భవతి చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకున్న సతీష్ వేగష్న దగ్గుబాటి ఫ్యామిలీ కోసం ప్రత్యేక కథ సిద్దం చేశారట. త్వరలో ఈ కథని ఆ హీరోలకి వినిపించి వీలైనంత త్వరగా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. ఈ సినిమా కథ నచ్చి వెంకటేష్, రానా, నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే దగ్గుబాటి అభిమానుల ఆనందం అవధులు దాటడం ఖాయం అని చెబుతున్నారు. ప్రస్తుతం సతీష్ వేగేష్న కోతి కొమ్మచ్చి అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అయ్యాక దగ్గుబాటి ఫ్యామిలి చిత్రంపై పుల్ ఫోకస్ పెట్టనున్నట్లు చెబుతున్నారు.