బాలకృష్ణ 109వ చిత్రంపై క్రేజీ అప్డేట్.!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో NBK 109 సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఉంది

By Medi Samrat  Published on  29 Oct 2024 7:15 PM IST
బాలకృష్ణ 109వ చిత్రంపై క్రేజీ అప్డేట్.!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో NBK 109 సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఉంది. వచ్చే ఏడాది విడుదల చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ చిత్రానికి 'సర్కార్ సీతారామ్' అనే టైటిల్ ను చిత్రబృందం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా టైటిల్ టీజర్ కూడా దీపావళి కానుకగా అక్టోబర్ 31న అభిమానుల ముందుకు రానుంది.

ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే రికార్డ్ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతోంది. 90 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా! ప్రస్తుతం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఈ దీపావళికి టైటిల్ టీజర్‌తో ప్రారంభం కానున్నాయి. నవంబర్ నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతాయని అంచనా. బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story