మళ్ళీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా గురించి క్రేజీ అప్ డేట్..
Crazy update about NTR Prashant Neil movie. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఇంకా కార్డ్స్‌లోనే ఉందట.
By Medi Samrat Published on 11 Feb 2021 10:08 AM GMT
"కెజిఎఫ్" సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాతో స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు ప్రశాంత్ నీల్..ఇక కేజిఎఫ్ సినిమా తరువాత తెలుగు హీరోలతో చెయ్యాలని అనుకున్నాడు. ఆ క్రమంలో మొదటగా సూపర్ స్టార్ మహేష్ పేరు వినిపించింది కానీ వర్క్ ఔట్ అవ్వలేదు. తరువాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ పేర్లు వినిపించాయి. ఇక ప్రభాస్ తో 'సలార్' సినిమా అనౌన్స్‌మెంట్ రాగానే… ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతే, ఎన్టీఆర్ అభిమానులు కూసింత నిరాశకు గురయ్యారు. కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్‌తోనే అని చాలా రోజుల నుంచి వార్తలు వస్తుండటం. 'కేజీఎఫ్ 2' అయ్యాక ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ 'సలార్' అనౌన్స్‌మెంట్ రావడం, సినిమా షూటింగ్ మొదలవ్వడంతో ఇక ఎన్టీఆర్ సినిమా ఉండదేమో అని కొందరు అనుకున్నారు. అయితే అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ శుభవార్త చెప్పింది.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఇంకా కార్డ్స్‌లోనే ఉందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నేపథ్య పనులు జరుగుతున్నాయట. 'సలార్' సినిమా అయిపోగానే ఎన్టీఆర్ సినిమా పనులు మొదలుపెట్టేలా ప్రశాంత్ నీల్ ప్లాన్స్ రెడీ చేసుకున్నాడట. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ విషయాన్ని నిర్మాతల నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి తెలిపారు. ఈ మాట విన్న ఎన్టీఆర్ అభిమానులు ఆ విషయాన్ని ఆనందంగా షేర్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా కూడా లైన్లో ఉందని తెలుస్తోంది. 'సలార్'ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నాడు.ఇక ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కే అవకాశం వుంది.