హరి హర వీరమల్లు క్లైమాక్స్ గురించి క్రేజీ న్యూస్

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న 'హరి హర వీర మల్లు' సినిమా చాలా సంవత్సరాలుగా సెట్స్ పైనే ఉంది

By Medi Samrat
Published on : 7 March 2025 4:06 PM IST

హరి హర వీరమల్లు క్లైమాక్స్ గురించి క్రేజీ న్యూస్

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న 'హరి హర వీర మల్లు' సినిమా చాలా సంవత్సరాలుగా సెట్స్ పైనే ఉంది. ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత పవర్ స్టార్ మళ్ళీ తెరపై కనిపించడం వల్ల అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ విజువల్ కంటెంట్ కు మాత్రం మంచి పేరే వచ్చింది.

ఈ సినిమాను సింగిల్ పార్ట్‌గా మొదట ప్లాన్ చేశారు, కానీ కథ కారణంగా రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుత నివేదికల ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో విడుదల అవుతుంది. రెండు భాగాల సినిమాకి, మొదటి భాగం క్లైమాక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. హరి హర వీర మల్లులో క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాన్ని 40 రోజులకు పైగా చిత్రీకరించారు. క్లైమాక్స్ ఫైట్ తర్వాత, VFX తో కూడిన ఒక గొప్ప సీక్వెన్స్ ఉంటుంది. ఇక్కడ పార్ట్ 2 కి పెద్ద లీడ్ ఉంటుంది. క్లైమాక్స్ కోసం పోస్ట్ ప్రొడక్షన్ తో సహా మొత్తం పని పూర్తయింది. చాలా బాగా వచ్చిందని, అవుట్ ఫుట్ తో చిత్ర బృందం సంతృప్తి చెందిందని తెలుస్తోంది.

Next Story