గాయని శ్రావణి భార్గవిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Complaint Against Sravana Bhargavi. గాయని శ్రావణి భార్గవి పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on  23 July 2022 3:33 PM IST
గాయని శ్రావణి భార్గవిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

గాయని శ్రావణి భార్గవి పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు. ఒకపరి ఒకపరి వయ్యారమై సంకీర్తనను గాయని శ్రావణ భార్గవి తన కోసం చిత్రీకరించిన తీరు అభ్యంతరకరమని వారు అన్నారు. అన్నమయ్య కీర్తనలతో చేసిన వీడియో తొలగించాలని, పాట తొలగించాలని విజ్ఞప్తి చేసిన తాళ్లపాక వంశీయులతో శ్రావణి భార్గవి దురుసుగా మాట్లాడారని శ్రావణి భార్గవి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చర్యతో శ్రావణభార్గవి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పాలని.. సోషల్ మీడియా నుంచి ఆ కీర్తను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వివాదంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. శ్రావణ భార్గవి వ్యవహార శైలిపై టీటీడీ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. శ్రావణి భార్గవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో సీఐకు తిరుపతి ప్రజలు ఫిర్యాదు చేశారు. 'ఒకపరి ఒకపరి వయ్యారమే' పాటను ఆమె శృంగారభరితంగా మార్చారంటూ అన్నమయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ పాటను యూట్యూబ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రావణ భార్గవి మాత్రం తాను పాడిన పాటలో ఎలాంటి అశ్లీలత లేదని స్పష్టం చేసింది.



Next Story