క‌మెడీయ‌న్ కూతురు నిశ్చితార్ధ వేడుకలో మెరిసిన సెల‌బ్రిటీస్

Comedian Raghubabu Daughter Engagement Ceremony.ఆదివారం రోజు ర‌ఘుబాబు కూతురు నిశ్చితార్ధ వేడుక హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది.

By Medi Samrat  Published on  16 Feb 2021 2:59 AM GMT
Comedian Raghubabu Daughter Engagement Ceremony

ప్ర‌ముఖ న‌టుడు, టాలీవుడ్ మేటి విల‌న్‌ గిరిబాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. తాను పోషించిన పాత్ర‌ల‌తో తెలుగు నాట‌ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న గొప్ప న‌టుడు. ఆయ‌న‌ త‌న‌యుడు ర‌ఘుబాబు కూడా తెరంగ్రేటం చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యారు. త‌న‌దైన హావభావాల‌తో ఆయ‌న పండించే కామెడీకి న‌వ్వ‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.

ప్ర‌ముఖ‌ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసిన రఘుబాబు తండ్రి గిరిబాబు మాదిరిగానే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. అయితే ఆదివారం రోజు ర‌ఘుబాబు కూతురు నిశ్చితార్ధ వేడుక హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.


మోహన్ బాబు, బ్రహ్మానందం, సాయి ధరమ్ తేజ్, రవితేజ, రాఘవేంద్ర రావు, మంచు లక్ష్మి, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, యాంకర్ అనసూయ తదితరులు హాజరై సందడి చేశారు. క‌రోనా కార‌ణంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కూ షూటింగ్‌లు లేక‌ థియేట‌ర్లు, పంక్ష‌న్‌లు లేని కార‌ణంగా టాలీవుడ్ ప్ర‌ముఖులెవ‌రూ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ గ‌డ‌ప దాట‌లేదు. చాన్నాళ్ళుగా క‌ల‌వ‌ని ఈ సెల‌బ్రిటీస్ నిశ్చితార్ధ వేడుక‌లో ఒక చోట చేరే స‌రికి అక్క‌డంతా సంద‌డిగా మారింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.Next Story