అలీతో పవన్ కళ్యాణ్.. కలిసి నటించబోతున్నారుగా..!
టాలీవుడ్ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు అలీ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 26 Aug 2024 6:53 PM ISTటాలీవుడ్ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు అలీ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య పొలిటికల్ గా కాస్త గ్యాప్ వచ్చిందని అంటారు. అయితే ఇటీవల ఏపీ ఎన్నికల తర్వాత అలీ ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. అలీ ఇటీవల రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్‌లో అతని పాత్ర కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే మంచి ప్రాజెక్టులతో అలీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారని.. అంతేకాకుండా తన మిత్రుడు పవన్ కళ్యాణ్ తో కూడా కలసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమాలో తాను చేసే పాత్రల విషయంలో సెలెక్టివ్‌గా మారానని అలీ చెబుతున్నారు. త్వరలోనే నాని హీరోగా నటించబోయే 'సరిపోదా శనివారం' లో కనిపించబోతున్నారు. అలీ ఇంతకుముందు 'అంటే సుందరానికి' చిత్రంలో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి పనిచేశారు. సరిపోదా శనివరంలో కూడా అలీ ముఖ్యమైన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం OGలో తాను ఒక పాత్రలో నటిస్తున్నట్లు అలీ ధృవీకరించారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో అలీ కామెడీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ విషయంలో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. సరిపోదా శనివారం, OG రెండింటినీ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై DVV దానయ్య నిర్మించారు.