CID, భారతదేశంలో అత్యంత పాపులర్ క్రైమ్ సిరీస్‌లలో ఒకటి. ఒకప్పుడు సోనీటీవీలో హిందీలో వచ్చిన ఈ షో.. డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సీఐడీ అందుబాటులోకి వచ్చింది. సీజన్ 2కు సంబంధించి ఇప్పటివరకూ వచ్చిన ఎపిసోడ్‌లు మొత్తం శుక్రవారం రిలీజ్ అవుతాయని, కొత్త ఎపిసోడ్‌లు ప్రతి శనివారం, ఆదివారాల్లో రాత్రి 10 గంటలకు స్ట్రీమింగ్ అవుతాయని నెట్ ఫ్లిక్స్ తెలిపింది.
ఫిబ్రవరి 21 నుండి, CID అభిమానులు Netflixలో ప్రసారమయ్యే షో రెండవ సీజన్‌లోని మొదటి 18 ఎపిసోడ్‌లను ఆస్వాదించవచ్చు. CID కొత్త ఎపిసోడ్‌లు ఫిబ్రవరి 22 నుండి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 10 గంటలకు నెట్ఫ్లిక్స్ లో విడుదల చేస్తారు. శివాజీ సతమ్, ఆదిత్య శ్రీవాత్సవ, దయానంద్ శెట్టి ప్రధాన పాత్రల్లో బీపీ సింగ్ రూపొందించిన షో ఇది. ఈ షో ప్రసారం 1998లో ప్రారంభమైంది. 2018 వరకు 1547 ఎపిసోడ్‌లతో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది.