ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్‌ మాస్టర్ కన్నుమూత

Choreographer Rakesh Master Passed Away. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్‌ మాస్టర్ (55) కన్నుమూశారు.

By Medi Samrat  Published on  18 Jun 2023 6:45 PM IST
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్‌ మాస్టర్ కన్నుమూత

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్‌ మాస్టర్ (55) కన్నుమూశారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇటీవల వైజాగ్ షూటింగ్‌ పాల్గొన్న రాకేశ్‌ మాస్టర్‌.. వారం రోజుల క్రితం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి అనారోగ్యానికి గురైన ఆయన స్థానిక హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. అయినా కోలుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్నారు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

గాంధీ హాస్పిటల్ సూపరింటెడెంట్ రాజారావు మాట్లాడుతూ.. రాకేష్ మాస్టర్ గాంధీ హాస్పిటల్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు అడ్మిట్ అయ్యార‌ని తెలిపారు. రాకేష్ మాస్టర్ డయాబెటిక్ పేషంట్ అని పేర్కొన్నారు. సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కార‌ణంగా షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయని.. సాయంత్రం ఐదు గంటలకు మృతి చెందిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్‌ పొంది చివరి నిమిషంలో గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యార‌ని పేర్కొన్నారు.





Next Story