చిత్రం 1.1 అనౌన్స్‌మెంట్‌.. ఉదయ్ కిరణ్‌ను మిస్ అవుతున్నాం

Chitram sequel Chirtram 1.1announced today. చిత్రం సినిమా.. సీక్వెల్ ఉంటుందని దర్శకుడు తేజ ప్రకటించారు.

By Medi Samrat  Published on  22 Feb 2021 5:13 PM IST
Chitram sequel

చిత్రం.. ఉదయ్ కిరణ్-రీమాసేన్ లను తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా.. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. దర్శకుడు తేజకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ ఉంటుందని దర్శకుడు తేజ ప్రకటించారు.

చిత్రం సినిమా 21 సంవత్సరాల కిందట ఒక సంచలనం. అతి తక్కువ బడ్జెట్టులో ఉషాకిరణ్ మూవీసీ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ గా నిలిచింది. కెమేరామేన్ గా రాణిస్తున్న తేజ ఈ చిత్రంతో దర్శకుడిగా మారి సత్తా చాటారు. ఉదయ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. అలాగే హీరోయిన్ రీమాసేన్ కూడా టాలీవుడ్ కి పరిచయమైంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తుండడం విశేషం. 'చిత్రం 1.1' పేరుతో దీనిని నిర్మిస్తున్నట్టు పేర్కొంటూ, దర్శకుడు తేజ ఈ రోజు టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.



తేజ చిత్ర నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్, ఎన్ స్టూడియోస్ కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక 'చిత్రం'లోలానే ఇందులో కూడా కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగును నిర్వహిస్తారు. దీనికి కూడా ఆర్ఫీ పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈ సినిమా పోస్టర్ వచ్చినప్పటి నుండి ఉదయ్ కిరణ్ ను మిస్ అవుతున్నాం అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు. చిత్రం 1.1 మరెంత అద్భుతంగా ఉండబోతోందో..!


Next Story