సేమ్ క‌ల‌ర్ డ్రెస్‌ల‌తో.. చిరు, చ‌ర‌ణ్ సంద‌డి

Chiru Charan At Movie Shooting Set.అభిమానులకు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ అభివాదం చేశారు.

By Medi Samrat  Published on  25 Feb 2021 11:37 AM IST
Chiru Charan At Movie Shooting Set

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్ట‌ర్‌ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. సామాజిక నేప‌థ్యం ఇతివృత్తంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం.. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల‌లో చిత్రీక‌ర‌ణ‌ జ‌రుపుకుంటుంది. కొన్ని కీలక స‌న్నివేశాలు తెకెక్కించేందుకు.. చిత్ర బృందం ఇటీవ‌ల‌ మారేడుమిల్లికి వెళ్లింది.

అక్క‌డ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నార‌ని తెలియ‌డంతో.. అక్క‌డి గ్రామ‌స్తులు షూటింగ్‌ లొకేష‌న్‌కు భారీగా చేరుకున్నారు. అభిమానులకు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ప‌లు ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇద్ద‌రు ఒకే క‌ల‌ర్‌ వైట్ ష‌ర్ట్‌, బ్లాక్ ప్యాంట్‌ల‌లో మెరిసిపోతున్నారు. ఈ ఫొటోలు చూసిన‌ ఫ్యాన్స్ లైక్స్‌, షేర్స్‌తో త‌మ అభిమానాన్ని చాటుతున్నారు. ఇదిలావుంటే.. ఆచార్య చిత్రం మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరు స‌ర‌స‌న‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. మెలోడీ బ్ర‌హ్మ‌ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నారు.




Next Story