రవితేజను మర్చిపోయిన మెగాస్టార్.. ఆ తర్వాత ఏమి చేశారంటే..?
Chiranjeevi Walter Veeraiah Press Meet. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'.
By Medi Samrat Published on 28 Dec 2022 6:15 PM ISTమెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస‍్తున్నారు. సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మూడు పాటలు రిలీజ్ చేసింది చిత్రబృందం. తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రబృందం ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. బాగా ఫన్ గా ఈవెంట్ సాగింది. ఈవెంట్ లో చిరంజీవి పలు విషయాలను వెల్లడించారు.
#WaltairVeerayyaPressMeet pic.twitter.com/M0dUgJvk2G
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2022
ఇక ఈ ప్రెస్‌మీట్‌లో తాను ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి ప్రస్తావించడం మర్చిపోయానని ట్వీట్ చేశారు. ఆ వ్యక్తి మరెవరో కాదు రవితేజ. రవితేజ గురించి ప్రస్తావించకపోవడంతో ఫీలైపోయిన బాస్ ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా చాలా విషయాలను చెప్పుకొచ్చారు. ' వాల్తేరు వీరయ్య టీం అందరితో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. సినిమా విడుదలకు చాలా ముందు జరిగినా టీం అందరూ ఎంతో సంతోషంగా వాళ్ల మెమోరీస్‌ను పంచుకోవడంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ సంతృప్తిగా జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని అనుకోవడంతో ముఖ్యంగా నా తమ్ముడు, వీరయ్యకు ముఖ్యమైన వ్యక్తి రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు ఈ విషయం గురించే వెలితిగా ఫీలయి ట్వీట్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చేయాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర నుంచి, కలిసి షూట్ చేసిన ప్రతి రోజూ రవితో మళ్లీ ఇన్నేళ్లకు చేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్‌లో రవితేజ పాత్ర చాలా ఉంది. ఆ విషయాలు త్వరలోనే మాట్లాడుకుందాం. ' అంటూ పోస్ట్ చేశారు.