హైదరాబాద్ లోని కోఠి ప్రాంతంలో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Spotted at Koti Women’s College. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని కోఠి ప్రాంతంలో కనిపించారు. అయితే ఆయనేదో షాపింగ్ కు

By Medi Samrat  Published on  15 March 2023 6:04 PM IST
హైదరాబాద్ లోని కోఠి ప్రాంతంలో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi


మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని కోఠి ప్రాంతంలో కనిపించారు. అయితే ఆయనేదో షాపింగ్ కు వచ్చారని మీరు అనుకోకండి. ఆయన వచ్చింది సినిమా షూటింగ్ లో భాగంగా మాత్రమే..! మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం 'భోళా శంకర్' సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఈ రోజు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. అందులో భాగంగా కోటీ విమెన్స్ కాలేజీలో సినిమాను చిత్రీకరిస్తూ వస్తున్నారు. కోటి ఉమెన్స్ కాలేజీకి హాజరయ్యే కాలేజీ విద్యార్థినిగా కీర్తి సురేష్ నటించనుంది. చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా కనిపిస్తోంది. అనసూయ భరద్వాజ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, తులసి, ప్రగతి, బిత్తిరి సత్తి, సత్య, ఉత్తేజ్, ప్రభాస్ శీను వంటి తారాగణంతో ఈ సినిమా రూపొందుతూ ఉంది. భోళా శంకర్‌ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.




Next Story