మా చేతిలో పెరిగిన చిన్నారి నిహారికని.. చైతన్య చేతిలో పెడుతున్న శుభతరుణంలో..

Chiranjeevi Shared Niharika Marriage Pic. మెగా బ్ర‌దర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక వివాహ మ‌హోత్స‌వంలో

By Medi Samrat  Published on  8 Dec 2020 5:53 AM GMT
మా చేతిలో పెరిగిన చిన్నారి నిహారికని.. చైతన్య చేతిలో పెడుతున్న శుభతరుణంలో..

మెగా బ్ర‌దర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక వివాహ మ‌హోత్స‌వంలో పాల్గొనేందుకు రెండు రోజుల ముందే మెగా ఫ్యామిలీ అంతా రాజ‌స్థాన్‌లోని ఉద‌య్ పూర్ కోట‌లో వాలారు. ఇప్ప‌టికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తైయ్యాయి. సోమ‌వారం రాత్రి తొమ్మిది గంటలకు మొదలై... అర్ధరాత్రి వరకూ సంగీత్ వేడుక జ‌ర‌గ‌గా కాబోయే వ‌ధూవ‌రులు ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి న‌టించిన చిత్రాల్లోని పాట‌ల‌కు స్టెప్‌లు వేస్తూ త‌మ‌దైన శైలిలో అల‌రించారు.

బుధ‌వారం ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు మెహందీ వేడుక‌, రాత్రి 7.15ని.ల‌కు వివాహ మ‌హోత్సవం జ‌ర‌గ‌నుంది. పెళ్లి నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నిహారికతో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి కూడా నిహారికతో కలిసి ఫొటో దిగి పోస్టు చేశారు.

చిన్న‌ప్పుడు నిహారిక‌ను ఎత్తుకున్న ఫోటోతో పాటు.. పెళ్లి కుమారైగా చేసిన త‌రువాత నిహారిక‌తో దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. 'మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు' అని చిరు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
Next Story
Share it