మ‌రికొన్ని జిల్లాల్లో మొద‌లైన‌ చిరు ఆక్సిజన్ బ్యాంక్స్ సేవ‌లు

Chiranjeevi Oxygen Banks. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన‌ మాట నిలబెట్టుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్

By Medi Samrat  Published on  29 May 2021 5:53 AM GMT
మ‌రికొన్ని జిల్లాల్లో మొద‌లైన‌ చిరు ఆక్సిజన్ బ్యాంక్స్ సేవ‌లు

మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన‌ మాట నిలబెట్టుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ ఆందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రెండు రోజుల క్రితం ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ‌లో ఖ‌మ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

తాజాగా రెండో విడ‌తగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంబించారు చిరంజీవి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూల్‌ జిల్లాల‌తో పాటు.. తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకు సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. ఈ మిషన్‌లో భాగమైన.. ప్రాణాలను కాపాడటానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Next Story