చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 210 కోట్ల గ్రాస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగు సినిమాలకు అత్యుత్తమ సీజన్ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అనిల్ రావిపూడి, చిరంజీవికి సంబంధించి సంక్రాంతి సినిమాలన్నీ మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించాయి.
మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకి మొదటి వారంలోనే పాజిటివ్ మౌత్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టం కాదు. సంక్రాంతి సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తునం' చిత్రాలు రెండు 200 కోట్ల గ్రాస్ సాధించగా, చిరంజీవి 'సైరా', 'వాల్తేరు వీరయ్య' చిత్రాలతో రెండు 200 కోట్ల గ్రాస్ సాధించారు. ఈ సినిమా హిట్ స్టేటస్ పొందాలంటే వారి 200 కోట్ల గ్రాసర్లలో 3వది కావాలి.