చిరు స్టెప్ వేస్తే.. ఆ మాత్రం రికార్డులు బద్దలవ్వవా..!

Chiranjeevi Laahe Laahe Song Create Records. మెగా స్టార్ చిరంజీవి డాన్స్.. గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..!

By Medi Samrat  Published on  27 Jun 2021 5:53 PM IST
చిరు స్టెప్ వేస్తే.. ఆ మాత్రం రికార్డులు బద్దలవ్వవా..!

మెగా స్టార్ చిరంజీవి డాన్స్.. గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! రాజకీయాలను వదిలి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా చిరంజీవిలో మునుపటి డాన్స్ చూస్తామా అని అందరూ ఆశగా ఎదురుచూసారు. అయితే చిరు మాత్రం ఖైదీ నెంబర్ 150లో దుమ్ము దులిపాడు. ఇక 'సైరా' లో కూడా ఆ మెరుపులు చూశాము..! ఇక త్వరలో ఆచార్య సినిమా రాబోతోంది. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక పాటను మాత్రమే వదిలారు. ఆ పాట కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే.. అందులో ఒక స్టెప్ కూడా ఉంది. ఆ స్టెప్ కూడా యువతను ఉరకలెత్తించేలా చేస్తోంది. అందుకే యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది.


ఆచార్య సినిమా నుంచి విడుదలైన 'లాహే లాహే' లిరికల్ వీడియో సాంగ్ 60 మిలియన్ల వ్యూస్ దాటింది. మణిశర్మ ఇచ్చిన సంగీతం సూపర్బ్ అని చెబుతూ ఉన్నారు. ఇక యాక్ట్రెస్ సంగీత కూడా సాంగ్ లో ఉండడం ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కూడా సినిమాలో జంటగా కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.

కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్యపై తెలుగు సినీ పరిశ్రమలో భారీగా అంచనాలున్నాయి. మే 13న విడుదల కావల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ నిలిచిపోయి ఆలస్యమైంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. మరో 12 రోజుల షూటింగ్ మిగిలుంది. చిరంజీవి, రామ్ చరణ్ మధ్య కీలక సన్నివేశం పూర్తయితే.. సినిమా పూర్తయినట్టేనని చెబుతున్నారు. జులై నెల రెండో వారంలో సినిమా షూటింగ్ పూర్తవ్వనుంది.


Next Story