చిరంజీవి గురించి మరోసారి తప్పుడు కథనాలు వైరల్

Chiranjeevi fires on media for rumours on his health and misleading the people. శనివారం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నిర్వహించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్ కు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

By Medi Samrat  Published on  4 Jun 2023 2:42 AM GMT
చిరంజీవి గురించి మరోసారి తప్పుడు కథనాలు వైరల్

శనివారం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నిర్వహించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్ కు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్ పై మాట్లాడుతూ.. తాను అలర్ట్​గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా non - cancerous polypsను డిటెక్ట్ చేసి.. వాటిని డాక్టర్లు తీసేశారు చిరంజీవి తెలిపారు. తనలో ఉన్న పాలిప్స్ ను డాక్టర్లు రిమూవ్ చేశారని చెప్పారు. ఈ అవగాహన తనకు లేకపోయి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో భయమేసిందన్నారు. తనకు అవగాహన ఉండటంతోనే ముందుకు వెళ్లి కొలనోస్కోపీ చేయించుకున్నానని వివరించారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే పెద్ద జబ్బు కాదని ఆయన పేర్కొన్నారు. స్మోకింగ్ చేయడం, గుట్కాలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఆయనకు ఏకంగా క్యాన్సర్ వచ్చిందని కథనాలు వండి వార్చడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలని మాత్రమే అన్నాను. అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు. " అంటూ ట్వీట్ పెట్టారు.


Next Story