భోళా శంకర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్

Chiranjeevi Bhola Shankar Music Mania Starts. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ రూపొందిస్తోన్న ఈ సినిమా

By M.S.R  Published on  30 May 2023 8:15 PM IST
భోళా శంకర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్

Chiranjeevi Bhola Shankar Music Mania Starts


మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భోళాశంకర్ పాటల సందడికి వేళైందని వెల్లడించింది. త్వరలోనే భోళాశంకర్ పాటలు అభిమానుల ముందుకు తీసుకువస్తామని చిత్ర బృందం తెలిపింది. భోళాశంకర్ మెగా మ్యూజిక్ మేనియా వచ్చేస్తోందంటూ మెగా ఫ్యాన్స్ కు చెప్పింది. భోళాశంకర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌. ఇప్పటికే దాదాపుగా షూటింగ్‌ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా కోసం మెహర్‌ రమేష్‌ ప్రత్యేకించి కొన్ని కొత్త సీన్లను ప్లాన్‌ చేస్తున్నాడట. శంకర్‌ దాదా ఎమ్‌బీబీఎస్‌ తరహాలో కామెడీని సృష్టించబోతున్నాడట. సినిమాలో మెగాస్టార్‌ తాలుకూ కామెడీ పుష్కలంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. మెహర్ రమేష్‌ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టాడు. 2013లో వచ్చిన షాడో తర్వాత ఇప్పటివరకు ఆయన మరో సినిమా చేయలేదు. ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి తాను కూడా దర్శకుడిగా నిలదొక్కుకోవాలని మెహర్ భవిస్తూ ఉన్నారు.


Next Story