మెగాస్టార్ 'భోళా శంకర్' షూటింగ్ షురూ

Megastar Chiranjeevi Bhola Shankar Shooting Update. మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేష్ కలయికలో రాబోతున్న భోళా శంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ మంగళవారం

By Sumanth Varma k  Published on  17 Jan 2023 9:48 PM IST
మెగాస్టార్ భోళా శంకర్ షూటింగ్ షురూ

మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేష్ కలయికలో రాబోతున్న భోళా శంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ మంగళవారం నుంచి హైదరాబాద్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కోల్ కత్తా సెట్ ను భారీ స్థాయిలో వేశారు. ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ లో పలు యాక్షన్ సీన్స్ ను షూట్ చేయబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ లో మెగాస్టార్ మాస్ ఎలివేషన్లు హైలైట్ గా ఉంటాయట.

ఎలాగూ దర్శకుడు మెహర్ రమేష్ కి మాస్ ఎలివేషన్లు బాగా హ్యాండిల్ చేస్తాడని మంచి పేరు ఉంది. పైగా ఇలాంటి మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదిరిపోతారు. గతంలో చిరు సినిమాలు హిట్ అయిందే ఆ ఎలివేషన్లతో. అయినా మెగాస్టార్ లాంటి మాస్ హీరో అంటే ఆ మాత్రం ఎలివేషన్లు ఎలాగూ అవసరం పడతాయి. దీనికి తోడు సినిమాలో కొత్తగా ఒకటి రెండు మాస్ ట్రాక్ లు కూడా యాడ్ చేస్తున్నారు. ప్రస్తుతం షూట్ చేసే సీన్స్ ఆ ట్రాక్ లోని ప్రధాన సీన్సే అని టాక్.

ఇక ఈ సినిమా భారీ సక్సెస్ కావాలంటే.. సిస్టర్ సెంటిమెంట్ తో భారీ యాక్షన్ టచ్ కూడా ఉండాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే.. తమిళ సినిమా రీమేక్ అయినప్పటికీ.. రాయలసీమ ఫ్యాక్షన్, మైనింగ్ ఇలాంటి వ్యవహారాలను ఈ చిత్రంలో జోడించబోతున్నారు. స్వతహాగా యాక్షన్ కంటెంట్ ఎక్కువ రాసే ఒకరి ఇద్దరు రైటర్స్ కూడా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. మరి ఈ భోళా శంకర్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ కి అయితే సెంటిమెంట్ ట్రీట్ తో పాటు మాస్ ట్రీట్ ఉంటుందని క్లారిటీ వచ్చింది.

















Next Story