ఏకైక నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డు.. ఆనందంలో ఫ్యాన్స్

యూకే పార్లమెంట్‌లో ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును చిరంజీవి అందుకున్నారు.

By Knakam Karthik
Published on : 20 March 2025 10:15 AM IST

Cinema News, Telugu News, Tollywood, Entertainment, Megastar Chiranjeevi, Lifetime Achievement Award, UK Parliament, Pawan Kalyan

ఏకైక నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డు.. ఆనందంలో ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనత సాధించారు. యూకే పార్లమెంట్‌లో ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును చిరంజీవి అందుకున్నారు. మార్చి 19వ తేదీన లండన్‌లోని పార్లమెంట్‌ భవనంలో చిరంజీవి ఈ అవార్డు అందుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకిగానూ చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వంలో ఈ సత్కారం జరిగింది. పార్లమెంట్‌ సభ్యులు సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌మాన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

కాగా చిరంజీవికి ఈ పురస్కారం రావడంపై ఆయన ఫ్యాన్స్‌లో ఆనందంలో ఉన్నారు. చిరంజీవి మరోసారి తెలుగు వాళ్లకి, యావత్ దేశానికి గర్వ కారణంగా నిలిచారంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక యూకే పార్లమెంటులో ఈ పురస్కారం అందుకున్న తొలి ఇండియన్ సెలబ్రెటీగా చిరు నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story