కవలలకు జన్మనిచ్చిన చిన్మయి.. ఆ రూమర్స్ కు చెక్

Chinmayi and Rahul Ravindran blessed with twin babies. గాయని చిన్మయి శ్రీపాద, నటుడు రాహుల్ రవీంద్రన్ కవలలకు స్వాగతం పలికారు.

By Medi Samrat
Published on : 22 Jun 2022 2:47 PM IST

కవలలకు జన్మనిచ్చిన చిన్మయి.. ఆ రూమర్స్ కు చెక్

గాయని చిన్మయి శ్రీపాద, నటుడు రాహుల్ రవీంద్రన్ కవలలకు స్వాగతం పలికారు. గాయని చిన్మయి శ్రీపాద గత రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ ప్రపంచంలోకి ద్రిప్త, శర్వస్ కొత్తగా వచ్చి చేరారని, వారు తమతోనే ఉండిపోయే అతిథులు అంటూ చిన్నారుల చేతులను పట్టుకున్న ఫొటోలను షేర్ చేశారు. కవలల్లో బాబు, పాప ఉన్నారు. తాను సరోగసీ ద్వారా పిల్లలకు తల్లయినట్లు వస్తున్న రూమర్స్ ను ఆమె ఖండించారు. తనకు సిజేరియన్ జరిగినట్లు వెల్లడించారు.

కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న చిన్మయి-రాహుల్ పెద్దల అంగీకారంతో 2014లో వివాహం చేసుకున్నారు. నటి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన చిన్మయి తెలుగులో పలు పాటలు పాడారు. రాహుల్ రవీంద్రన్ హీరోగా, సహాయనటుడిగా ఎన్నో మంచి పాత్రలు చేశారు. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు.








Next Story