కాలుష్యం వ‌ల్ల పురుషాంగం సైజు త‌గ్గుతోంది.. షేర్ చేసిన దియా

Check Out Dia Mirza's Hilarious Reaction To Report On Pollution Causing Penises To Shrink. వాతావరణ స‌మ‌స్య‌ల గురించి గ‌ళం

By Medi Samrat  Published on  27 March 2021 5:08 AM GMT
కాలుష్యం వ‌ల్ల పురుషాంగం సైజు త‌గ్గుతోంది.. షేర్ చేసిన దియా

వాతావరణ స‌మ‌స్య‌ల గురించి గ‌ళం విప్పుతున్న క‌థానాయిక‌ల‌లో దియామీర్జా ముందు వరుసలో ఉంటారు. అవకాశం ఉన్న ప్రతి చోటా పర్యావరణానికి సంబంధించి త‌న వాణిని వినిపిస్తారు. పర్యావరణాన్ని కంటిపాపలా కాపాడుకోవాల‌ని చెబుతుంటారు. ఇందుకు సంబంధించిన విశేషాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఎప్ప‌టిలాగే తాజాగా దియా షేర్ చేసిన ఓ న్యూస్ ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

కాలుష్యం వల్ల పురుషాంగం పరిమాణం తగ్గిపోతోందంటూ 'స్కై న్యూస్' వార్తాసంస్థ‌ ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఈ వార్తను షేర్ చేసిన దియా.. వాతావరణ కాలుష్య సంక్షోభాన్ని ప్రపంచం ఇప్పటికైనా సీరియస్‌గా తీసుకుంటుందని భావిస్తున్నా అని రాసుకొచ్చారు. దియా పోస్టును లైక్‌లు, షేర్ల‌తో వైర‌ల్ చేస్తున్నారు. మీరు మ‌రో గ్రెటా థ‌న్‌బ‌ర్గ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలావుంటే.. హైదరాబాదీ అయిన దియామీర్జా మోడల్, నటి, నిర్మాత.'మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్' టైటిల్‌ను గెలుచుకుంది. దియా ఈ మ‌ధ్య‌నే వ్యాపారవేత్త వైభవ్ రేఖిని పెళ్లాడింది. ప్ర‌స్తుతం ఈ జంట మాల్దీవుల‌లో హాలిడే ఎంజాయ్ చేస్తుంది. ఇక దియా ప్ర‌స్తుతం కింగ్‌ నాగార్జున నటిస్తున్న 'వైల్డ్ డాగ్' సినిమాలో న‌టిస్తుంది.Next Story
Share it