'చంటి' సినిమా ముందుగా ఆ హీరోతో చేయాలనుకున్నారట.. కానీ!
Chanti Movie News. వెంకటేష్, మీనా హీరో హీరోయిన్లగా దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన " చంటి" సినిమా ముందుగా ఆ హీరోతో చేయాలనుకున్నారట.. కానీ.
By Medi Samrat Published on 11 Jan 2021 1:51 PM ISTముందుగా చంటి సినిమాలో నటించడానికి వెంకటేష్ కి బదులు రాజేంద్ర ప్రసాద్ అని భావించారు. కానీఈ సినిమాను వెంకటేష్ తో తీయడానికి గల కారణాలను దర్శకుడు రవి రాజా పినిశెట్టి ఓ సందర్భంలో తెలియజేశాడు. ఇంత అద్భుతమైన సినిమా 1992 జనవరి 10వ తేదీన విడుదల అయి ఎంతో విజయాన్ని సాధించింది. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన 'చినతంబి'సినిమాని తెలుగులో చంటి గా తెరకెక్కింది.
యార్లగడ్డ సురేందర్ నిర్మాతగా వెంకటేశ్‌తో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాం. ఆ సమయంలో రామానాయుడు తమిళంలో తెరకెక్కిన చిన్న తంబి చిత్రాన్ని చూసి ఆ కథ వెంకటేష్ కు సరిపోదని భావించారు. అదే సమయంలో కె ఎస్ రామారావు గారు కూడా ఆ సినిమాను చూసి ఆ పాత్రలో నటించడానికి రాజేంద్రప్రసాద్ సరిపోతారని భావించారు. దీంతో ఆ విషయాన్ని రాజేంద్రప్రసాద్ కి చెప్పి సినిమాను కూడా ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ తో నాకున్న పరిచయం బట్టి అతను హీరోగా ఈ సినిమాలో నటిస్తే మంచిగా వస్తుందని భావించారు. అయితే ఇదంతా కూడా తమిళంలో చిన్న తంబీ విడుదల కాకముందు జరిగింది.
తరువాత తమిళంలో ఆ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాను సురేష్ బాబు వెంకటేష్ చూశారు. వారికి కూడా ఈ సినిమా నచ్చింది. దీంతో కె.ఎస్.రామారావు నా దగ్గరకు వచ్చి వెంకటేష్ హీరోగా ఈ సినిమాను తీద్దామని తెలిపాడు. అయితే అప్పటికే రాజేంద్ర ప్రసాద్ కి మాట ఇచ్చి ఉండడంతో అందుకు నేను ఒప్పుకోలేదు అని తెలియజేశారు. అవసరమైతే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి భావించారట. అయితే ఆ సమయంలో చిరంజీవి గారు నాకు నచ్చజెప్పడంతో ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నాను. అయితే అదే సమయంలో ఖుష్బూ వెంకటేష్ సరసన నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఆ పాత్రలో మీనాను తీసుకొని చిత్రాన్ని నిర్మించినట్లు దర్శకుడు రవిరాజా పినిశెట్టి తెలియజేశారు.