'అఖండ'పై ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు

Chandrababu Comments On Akhanda Movie. నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని

By Medi Samrat  Published on  11 Dec 2021 5:40 PM IST
అఖండపై ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని దూసుకుపోతోంది. 2021లో ఓవర్సీస్‌లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ యేడాది ఓవర్సీస్‌లో విడుదలైన 'వకీల్ సాబ్' తో పాటు 'లవ్ స్టోరీ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలు ఏవి యూఎస్‌లో 1 మిలియన్ యూఎస్ డాలర్లు వసూళ్లు చేయలేకపోయాయి. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఊర మాస్ చిత్రం 'అఖండ' తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ బాక్సాఫీస్ లో కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మన దేశ కరెన్సీలో రూ. 6.58 కోట్లు వసూళు చేసింది. అటు ఆస్ట్రేలియాలో రూ. 1.26 కోట్లు.. UKలో 0.72 కోట్లు.. యూరోప్ .. 0.15 కోట్లు.. గల్ఫ్ కంట్రీస్ 0.80 కోట్లు.. కెనడాలో 0.25 కోట్లు.. సింగపూర్‌లో 0.13 కోట్లు.. మలేషియాలో 4 లక్షలు.. మిగతా అన్ని కంట్రీస్ కలిపి రూ. 20 లక్షల వరకు వసూళ్లు సాధించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ ను సొంతం చేసుకోనుంది.

'అఖండ' సినిమాను టీడీపీ అధినేత చంద్రబాబు వీక్షించారు. తాను 'అఖండ' చిత్రాన్ని చూశానని చంద్రబాబు తెలిపారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో చూపించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అద్భుతంగా తెరకెక్కించారని కితాబునిచ్చారు. సినిమా చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. "సినిమాలో చూపించిన విధంగానే ఇప్పుడు ఏపీ లో జరుగుతోంది. రాష్ట్రం లో ఇప్పుడు ఏమి జరుగుతుందో అఖండ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు" అని చంద్రబాబు అన్నారు. అఖండ సినిమా చాలా బాగుందని.. చిత్రయూనిట్ కు అబినందనలు తెలిపారు చంద్రబాబు.


Next Story