టీ-సిరీస్ అధినేతపై అత్యాచార ఆరోపణలు

Case registered against T-Series MD Bhushan Kumar. ప్రముఖ ఆడియో సంస్థ‌ టీ-సిరీస్ అధినేత, నిర్మాత భూషణ్ కుమార్‌పై అత్యాచార ఆరోపణలు

By Medi Samrat
Published on : 16 July 2021 6:33 PM IST

టీ-సిరీస్ అధినేతపై అత్యాచార ఆరోపణలు

ప్రముఖ ఆడియో సంస్థ‌ టీ-సిరీస్ అధినేత, నిర్మాత భూషణ్ కుమార్‌పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 30 ఏళ్ల వ‌య‌సున్న ఓ మ‌హిళ ఈ మేర‌కు ఆరోప‌ణ‌లు చేస్తుంది. 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ వివిధ ప్రదేశాల్లో త‌న‌పై అత్యాచారం చేశాడని బాధిత మ‌హిళ డీఎన్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2017 నుండి మూడేళ్ళపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని మ‌హిళ‌ ఆరోపించింది.

మూడేళ్లవుతున్న తనకు అవకాశం ఇవ్వలేదని.. భూషణ్ ను అడిగితే తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొంది. బాధిత మ‌హిళ‌ ఫిర్యాదు మేరకు భూషణ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు భూష‌ణ్‌ను విచారించాల్సివుంది. ఇక భూషణ్.. తండ్రి గుల్షన్ కుమార్ హత్యానంతరం టీ సిరీస్ బాధ్యతలు చేపట్టారు. 2005లో నటి దివ్యా ఖోస్లాను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.


Next Story