బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా, ఒక పోలీసు కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది, అక్కడ శ్రీనివాస్ తన కారును నడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ఆపి హెచ్చరించారు. రాంగ్ రూట్ లో వాహనం నడపడం గురించి ప్రశ్నించినప్పుడు, శ్రీనివాస్ వివరణ ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ప్రస్తుతం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. భైరవం మే 30న విడుదలకానుంది.