గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అవుతుందనుకునే లోపే 'పుష్ప' సినిమాపై వివాదం తలెత్తింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా విడుదలకు సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఎంతో గ్రాండ్‌గా జరిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మినహా అందరూ హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్‌లో మెరిసింది. సమంత డ్యాన్స్ చేసిన ఈ ఐటెం సాంగ్‌పై వివాదం చెలరేగుతోంది. 'పుష్ప' సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.
సమంత తన కెరీర్‌లో ఫస్ట్‌టైమ్ చేసిన ఐటం సాంగ్ ఇదే. ఉ అంటావా మావ.. ఊఊ అంటావా అంటూ సాగే పాటకు సమంత స్పెషల్ డ్యాన్స్ చేసింది. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఇక ఈ పాటలో సమంత సైతం తన అందచందాలను ఆరబోసింది. అయితే ఆ పాటపై ఇప్పుడు పురుషుల సంఘం కేసుపెట్టింది. పురుషులను కామాంధులుగా చూపించే ప్రయత్నం ఈ పాటలో చేసారని వాళ్లు ఆరోపించిరాని తెలుస్తుంది. పాటలోని సాహిత్యం, విజువల్స్ పురుషులను వంకర బుద్ధితో చూపించే ప్రయత్నం చేశారని, అందుకే ఈ స్పెషల్ సాంగ్‌పై దావా వేయబడింది.
ఈ పాటపై నిషేధం విధించాలంటూ పురుషుల సంఘం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఇంకా కేసు పరిష్కారం కాలేదు. సమంత రూత్ ప్రభుపై కూడా పురుష సంఘం కేసు పెట్టారు. ఒక ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చేశారు. మీ మగబుద్దే పాడు బుద్దీ అంటూ సాగే ఈ పాటపై ఇప్పుడు పురుష సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న ప్రేక్షకుల ముందుకు రానుంది.