దుల్కర్ సల్మాన్ సినిమాపై కేసు నమోదు

Case filed against Dulquer Salmaan-starrer Kurup in Kerala High Court. దుల్కర్ సల్మాన్.. మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

By M.S.R  Published on  12 Nov 2021 4:45 AM GMT
దుల్కర్ సల్మాన్ సినిమాపై కేసు నమోదు

దుల్కర్ సల్మాన్.. మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కనులు కనులు దోచాయంటే సినిమా హిట్ తో మరింత చేరువయ్యాడు. మలయాళంలో టాప్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈరోజు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'కురుప్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతలో ఈ సినిమాపై కేరళలో కేసు నమోదైంది.

నవంబర్ 12న థియేటర్లలోకి రాబోతున్న దుల్కర్ సల్మాన్ నటించిన 'కురుప్' సినిమాపై కేరళ హైకోర్టులో కేసు దాఖలైంది. కొచ్చి నివాసి దాఖలు చేసిన పిఐఎల్‌లో, సినిమా ఆధారంగా రూపొందించిన కరుడుగట్టిన నేరస్థుడు సుకుమార కురుప్ గోప్యతను ఈ చిత్రం ఉల్లంఘించేలా ఉందని పేర్కొంది. ఈ పిల్‌పై స్పందించిన కేరళ హైకోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌పోల్, సినీ నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సినిమాపై కోర్టు స్టే విధించలేదు.. దీంతో సినిమా రిలీజ్ కు ఎటువంటి అంతరాయం కలగడం లేదు.

'కురుప్' 1984లో చాకో అనే వ్యక్తిని హత్య చేసి, ఆ శవాన్ని ఉపయోగించి భీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి తన స్వంత మరణాన్ని నకిలీ చేస్తాడు. ఆ తర్వాత ఎన్నో మోసాలకు పాల్పడుతాడు. దుల్కర్ సల్మాన్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోలీసుల నుండి తప్పించుకున్న సుకుమార కురుప్ పాత్రను పోషించాడు. కురుప్ సినిమా కొన్ని నెలల కిందటే విడుదల కావాల్సి ఉంది. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా, చిత్రం వాయిదా పడింది. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల నటించింది.


Next Story