మ‌హేష్‌ 'బిజినెస్‌మెన్' రీ రిలీజ్‌కు సిద్ధం.. ఎప్పుడంటే..

Businessman to be re-released on Mahesh Babu's birthday. ఈ మధ్య కాలంలో పలు సినిమాలు రీరిలీజ్ అవుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  2 July 2023 6:31 PM IST
మ‌హేష్‌ బిజినెస్‌మెన్ రీ రిలీజ్‌కు సిద్ధం.. ఎప్పుడంటే..

ఈ మధ్య కాలంలో పలు సినిమాలు రీరిలీజ్ అవుతూ ఉన్నాయి. తాజాగా సూపర్ స్టార్ మాస్ హిట్ మూవీ “బిజినెస్‌మెన్” రీ-రిలీజ్ కు సిద్ధమైంది. బిజినెస్‌మెన్ సినిమా 4కే రీ-మాస్టర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీని పూరి జగన్నాథ్ తెరకెక్కించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించాడు.

ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఆరోజు బిజినెస్‌మెన్ సినిమా రీరిలీజ్ చెయ్యనున్నారు. కల్ట్ క్లాసిక్ సినిమా అయిన బిజినెస్‌మెన్ సినిమా చూడడానికి సినిమా అభిమానులు తప్పకుండా వస్తారని భావిస్తూ ఉన్నారు. బిజినెస్‌మెన్ సినిమా రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అనుకుంటూ ఉన్నారు.

ఇక మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్ష‌న్ లో “గుంటూరు కారం” అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ష‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అతడు, ఖలేజా వంటి కల్ట్‌ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మధ్య విడుదలైన గ్లింప్స్‌కు ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. మహేష్‌ను మాస్‌ యాంగిల్‌లో చూసి చాలా కాలం అయింది. ఈ సినిమాతో అభిమానుల కోరిక కూడా తీరనుంది. ఇటివలే ఈ ప్రాజెక్ట్‌ నుంచి పూజా హెగ్డే తప్పుకుందనే ప్రచారం కూడా సాగుతోంది. శ్రీలీల మరో హీరోయిన్ గా ఉండగా.. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షీ చౌదరీని తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. థమన్‌ స్వరాలందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసనీ క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తీ అయ్యాక మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు.


Next Story