మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నెల 5న ఆయన శ్వాస తీసుకోడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్టెంట్ అమర్చి.. ఐసీయూలో చికిత్సను అందిస్తూ వచ్చారు. అయితే శనివారం ఉదయం తెల్లవారుజామున 4:50 కు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్‌సిటీ లోని నివాసానికి తరలించనున్నారు.