బ్రహ్మానందం బ‌ర్త్ డే స్పెష‌ల్‌.. జ‌నాలు అసహ్యించుకునే 'వరద రాజు' లుక్ రిలీజ్‌

Brahmanandam’s poster from ‘Keedaa Cola’ revealed. బ్రహ్మానందం బుధవారం నాడు తన 67వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

By M.S.R  Published on  1 Feb 2023 5:16 PM IST
బ్రహ్మానందం బ‌ర్త్ డే స్పెష‌ల్‌.. జ‌నాలు అసహ్యించుకునే వరద రాజు లుక్ రిలీజ్‌

బ్రహ్మానందం బుధవారం నాడు తన 67వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన 'కీడ కోల' చిత్రం నుండి లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందంతో ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. తరుణ్ భాస్కర్ తన పోస్ట్‌లో, బ్రహ్మానందం వరద రాజు పాత్రలో నటిస్తున్నారని, ప్రజలు అసహ్యించుకోవడానికి ఇష్టపడే నీచమైన ముసలి తాతయ్య పాత్రను పోషిస్తారని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో 8 ప్రధాన పాత్రలు ఉంటాయి. హీరోలు, హీరోయిన్లు లేరని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్‌లను అందించిన తర్వాత తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వం వహించిన మూడో చిత్రం ‘కీడ కోల’. విజి సైన్మ బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.రెండు వరుస హిట్‌లను అందించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడవ ప్రాజెక్ట్ కీడా కోలా ప్రకటించడంతో యూత్ లో మంచి హైప్ ఉంది.


Next Story