భీమ్లా నాయక్ సినిమాలో.. బ్రహ్మానందం పోస్టర్ విడుదల

Brahmanandam new look in bheemla nayak movie. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న 'భీమ్లా నాయక్‌' సినిమాలో బ్రహ్మానందం నటిస్తున్నారు. సినిమాలో బ్రహ్మానందం లుక్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది.

By అంజి  Published on  8 Dec 2021 3:03 AM GMT
భీమ్లా నాయక్ సినిమాలో.. బ్రహ్మానందం పోస్టర్ విడుదల

చక్కిలిగింతలతో కడుపుబ్బ నవ్వించే తెలుగు లెజండరీ కమెడియన్‌ బ్రహ్మానందం. ఆయన తన హాస్యంతో తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించిన బ్రహ్మానందం తన ఎక్స్‌ప్రేషన్‌తో కడుపు పగిలేలా నవ్వులు పూయించారు. బ్రహ్మానందం నటించిన సినిమాల్లోని సీన్‌లు, హావభావాలను ఇప్పటికీ మీమ్స్‌ రూపంలో వాడుతున్నారంటే ఆయన ఎంతగా నవ్వించారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అరకొర సినిమాల్లో నటిస్తున్న.. ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమాలు అంటూ లేవు. తాజాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న 'భీమ్లా నాయక్‌' సినిమాలో బ్రహ్మానందం నటిస్తున్నారు. సినిమాలో బ్రహ్మానందం లుక్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది.

ఈ సినిమాలో బ్రహ్మానందం పోలీస్‌ రోల్‌లో నటిస్తున్నారు. 'భీమ్లా నాయక్‌' సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడంటే కమెడీ అదుర్స్‌ అనే చెప్పొచ్చు. పోలీస్ గెటప్ లో ఉన్న బ్రహ్మానందం పోస్టర్ ను కూడా విడుదల చేయడంతో అటు పవన్‌ అభిమానులు, ఇటు బ్రహ్మానందం అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో యాక్ట్‌ చేయడం విశేషంగా మారింది. భీమ్లా నాయక్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12,2022న థియేటర్‌లో సందడి చేయనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ రాస్తున్న ఈ సినిమాకు సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.


Next Story