బోయపాటి శ్రీను.. అలాంటి మాట అనకూడదా?
దర్శకుడు బోయపాటి శ్రీను `స్కంద` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
By Medi Samrat Published on 8 Oct 2023 6:50 PM ISTదర్శకుడు బోయపాటి శ్రీను `స్కంద` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. అయితే `అఖండ` సినిమాని మించి హై బీజీఎం ఇచ్చాడని.. కానీ ఎక్కడో తప్పు జరిగిందని పలువురు విమర్శలు గుప్పించారు.
తాజాగా దర్శకుడు బోయపాటి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. ఆ ఒక్క కంప్లెయింట్ అయితే ఉందని అన్నారు. అదే సమయంలో `అఖండ` ప్రస్తావన వచ్చినప్పుడు జర్నలిస్ట్.. `అఖండ` ఆ రేంజ్‌లో ఎలివేట్ కావడానికి థమన్ ప్రాణం పెట్టాడని, ఆయన మ్యూజిక్ నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లిందన్నారు. బోయపాటి శ్రీను స్పందిస్తూ, ఆ సినిమాని ఆర్ ఆర్ లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారని, దానికి అంత దమ్ము ఉంటుందని, అయితే ఆ పర్టిక్యులర్ కల్ట్ మీద థమన్ అద్భుతంగా చేయగలిగాడని బోయపాటి ప్రశంసించారు. బోయపాటి కామెంట్లపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా థమన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. థమన్ `ఐ డోంన్ట్ కేర్` అని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ట్రోల్స్ ను తాను పట్టించుకోనని థమన్ అన్నాడా.. లేక బోయపాటి శ్రీను మాటలను పట్టించుకోనని అన్నాడో అని నెటిజన్లు చర్చించుకుంటూ ఉన్నారు.