బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను ఆమె సోదరి రంగోలీ చందేల్ లను ఇప్పటికిప్పుడు అరెస్టు చేయకండి.. ఇది బాంబే హైకోర్టు ఈరోజు చేసిన వ్యాఖ్యలు. జనవరి 8న ముంబై పోలీసుల ముందు హాజరుకావాలని కంగన, రంగోలీని ఆదేశించారు. తాము లోతుగా వాదనలను వినేంత వరకు పిటిషన్ దారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చందేల్ పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేసును కొట్టేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బాంబే హైకోర్టును వీరు ఆశ్రయించారు. సమన్లను తాము గౌరవిస్తున్నామని... ఇదే సమయంలో అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోరారు. వీరి తరపు వాదనలను విన్న హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇప్పట్లో వీరిని అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించింది. కానీ వీరిరువురూ జనవరి 8న ముంబై పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించారు. సమన్లకు స్పందించకపోవడానికి కారణం.. మా ఇంట్లో జరుగుతున్న పెళ్లి అని కంగనా, చందేల్ లు కోర్టుకు తెలిపారు. సమన్లను గౌరవించాల్సి ఉంటుందని బాంబే హై కోర్టు తెలిపింది.
సామ్రాట్

Next Story