షారుఖ్ తో నటించింది.. కోవిడ్ సమయంలో సేవ చేసింది.. ఇప్పుడు పక్షవాతం బారిన పడింది
Bollywood actress Shikha Malhotra hospitalised. బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా పక్షవాతానికి గురైంది.
By Medi Samrat Published on
15 Dec 2020 12:06 PM GMT

బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా పక్షవాతానికి గురైంది. వైద్య విద్యార్థిని అయిన శిఖా నటనపై ఆసక్తితో సినిమా ఇండస్త్రీలో అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన శిఖా షారుక్ ఖాన్ 'ఫ్యాన్' చిత్రంలో కీలక పాత్ర పోషించి నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. కోవిడ్ బారిన పడిన వారికి సేవలందించేందుకు శిఖా మళ్లీ నర్సుగా మారింది. ఎంతోమంది కరోనా పెషేంట్స్‌కు ఆస్పత్రిలో సేవలు అందించింది. ఆమెకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా నుండి కోలుకుని ఇటీవల ఆరోగ్యంతో ఇంటికి వచ్చింది.
కానీ ఆమె ఇటీవల పక్షవాతం బారిన పడింది. నటి శిఖా మల్హోత్రా పక్షవాతం బారిన పడ్డ విషయాన్ని ఆమె మేనేజర్ అశ్విన్ శుక్లా మంగళవారం ప్రకటించారు. 'శిఖా పక్షవాతానికి గురయ్యారు. ఆమెకు కుడి వైపు స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం శిఖా కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు' అంటూ ఆమె ఫొటోను షేర్ చేశాడు. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు షాక్ గురవుతున్నారు. శిఖా త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు.
Next Story