'గాడ్సే'గా స‌త్య‌దేవ్‌

Bluff Master Satya Dev Turns Godse. 'బ్లఫ్‌ మాస్టర్' ‌కాంబినేష‌న్ లో మరోసారి యువ హీరో సత్యదేవ్ 'గాడ్సే' సినిమా .

By Medi Samrat
Published on : 3 Jan 2021 6:18 PM IST

Satya Devs Godse movie

'బ్లఫ్‌ మాస్టర్'‌, 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేశాడు స‌త్య‌దేవ్‌. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. విభిన్న పాత్ర‌లలు పోషిస్తూ.. బహుముఖ నటుడిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చాడు. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 'లూసిఫర్' రీమేక్‌లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. విల‌న్‌గా లేదంటే సీఎం పాత్ర‌లో స‌త్యదేవ్ క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.



ఇదిలా ఉంటే.. తాజ‌గా ఈ యువ హీరో న‌టిస్తున్న చిత్రం 'గాడ్సే'. ఈ సినిమా ద్వారా బ్ల‌ఫ్ మాస్ట‌ర్ కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ కాబోతోంది. ఆ మూవీని రూపొందించిన దర్శకుడు గోపి గణేష్ పట్టాభినే 'గాడ్సే'ను తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. గన్ పట్టుకొని యాాంగ్రీ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే.. సినిమా మొత్తం యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పకనే చెబుతోంది. పవర్ ఫుల్ టైటిల్ కు తగ్గట్టుగా ఉన్న సత్యదేవ్ లుక్.. అందరినీ ఆకట్టుకుంటోంది.


Next Story