బింబిసార తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?

Bimbisara First Day Collection. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన 'బింబిసార' సినిమా హిట్ టాక్ ను

By Medi Samrat  Published on  6 Aug 2022 6:43 PM IST
బింబిసార తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?

కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన 'బింబిసార' సినిమా హిట్ టాక్ ను అందుకుంది. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తొలి ఆటతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇన్ని రోజులుగా మంచి హిట్ లేకుండా ఉన్న టాలీవుడ్ కు బింబిసారతో మంచి టైమ్ వచ్చింది. మొదటిరోజు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ ను సాధించింది. తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 9.30 కోట్ల గ్రాస్ ను .. 6.30 కోట్ల షేర్ ను వసూలు చేసింది. కల్యాణ్ రామ్ కెరియర్లో తొలిరోజున ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి. "బింబిసార" సినిమా మొదటి రోజునే 45% రికవరీ పూర్తి చేసుకుంది.

ఇక వారాంతం పూర్తయ్యాక ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తుందని చెప్పవచ్చు. ఈ విజయంపై కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఇది సినీ అభిమానుల విజయమని చెప్పారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే... ప్రజలు థియేటర్లకు వస్తారని నిరూపించారని అన్నారు. సినిమాను ప్రేక్షకులు బతికించారని చెప్పారు. ఈ సినిమాను తన వద్దకు తీసుకొచ్చిన వశిష్టకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదని అన్నారు.


Next Story