అసలు ఆ యాంగిల్స్ ఏమిటి? మీరు ఎక్కడ జూమ్ చేస్తున్నారు.. అయేషాకు కోపం వచ్చేసింది

బిగ్ బాస్ 17 ఫేమ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, నటి అయేషా ఖాన్ కొందరు ఫోటోగ్రాఫర్లపై విరుచుకుపడింది.

By Medi Samrat  Published on  4 April 2024 9:30 PM IST
అసలు ఆ యాంగిల్స్ ఏమిటి? మీరు ఎక్కడ జూమ్ చేస్తున్నారు.. అయేషాకు కోపం వచ్చేసింది

బిగ్ బాస్ 17 ఫేమ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, నటి అయేషా ఖాన్ కొందరు ఫోటోగ్రాఫర్లపై విరుచుకుపడింది. 'అసలు ఆ యాంగిల్స్ ఏమిటి? మీరు ఎక్కడ జూమ్ చేస్తున్నారు? అసలు మీకు అనుమతి ఉందా? కొందరు మీడియా వాళ్లు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారు? ఒక స్త్రీ తన దుస్తులు కూడా సర్దుకునే స్వేచ్ఛ లేదా. తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది. ఒక మహిళ తన కారులో నుంచి దిగే ముందు తన దుస్తులను సర్దుకుంటూ ఉన్నప్పుడు ఆ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తారా? ఒక మహిళ తనను వెనుక నుంచి ఫోటోలు తీయకూడదనే కోరుకుంటుంది. మహిళలకు కనీస మర్యాద ఎలా ఇవ్వాలో మీరు నేర్చుకోండి'. అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది అయేషా.

వెనుక నుండి జూమ్ చేయవద్దని నటీమణులు ఫోటోగ్రాఫర్ లను అడగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, నటి మృణాల్ ఠాకూర్, హీనా ఖాన్ లు బ్యాక్ సైడ్ నుండి పోజులు ఇవ్వడానికి నిరాకరించారు. వర్క్ పరంగా అయేషా ఖాన్ ఇటీవల ఓం భీమ్ బుష్ లో కనిపించింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో ఐటెమ్ నంబర్‌లో కనిపించింది.

Next Story