ఆ ట్రోల్స్ వల్ల చాలా బాధ పడ్డ.. కానీ పశ్చాత్తాపం లేదు: సోహైల్
Bigg Boss 4 Contestant Sohel About Trolls. బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ లలో ఒకరైనా సోహైల్ ఆ ట్రోల్స్ వల్ల చాలా బాధ పడ్డ.. కానీ పశ్చాత్తాపం లేదు.
By Medi Samrat Published on 9 Jan 2021 3:52 PM ISTబిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ లలో ఒకరైనా సోహైల్ అప్పటివరకు చిన్న చిన్న పాత్రలలో నటించే వారు. కానీ బిగ్ బాస్ షో ద్వారా ఒక్కసారిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సోహైల్ బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు"కథ వేరే ఉంటది"అనే ఈ పదాన్ని వాడుతూ అందరిని ఆకట్టుకున్న సోహైల్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈ రోజు అనూహ్య నిర్ణయం తీసుకోవడం పట్ల ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
అఖిల్, అభిజిత్ తో పాటు సోహైల్ టాప్ త్రీ కంటెస్టెంట్ గా నిలిచారు. ఫినాలే రోజు బిగ్ బాస్ ఇచ్చిన 25 లక్షల రూపాయలు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఆ డబ్బులలో కొంత మొత్తం మెహబూబ్ కి, మరికొంత అనాధ శరణాలయానికి ఇస్తామని చెప్పడంతో మరోసారి తన అభిమానులను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఫినాలే కు గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పడంతో సోహైల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ తర్వాత సోహైల్ కు మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు.
బిగ్ బాస్ సోహైల్ కు ఏ స్థాయిలో మంచి పేరు సంపాదించి పెట్టిందో అంతే స్థాయిలో విమర్శలు కూడా తీసుకువచ్చింది. ముఖ్యంగా బిగ్ బాస్ ఫినాలే ముందు అతడి స్నేహితుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మెహబూబ్ చేసిన సైగల ద్వారానే తన మూడో స్థానంలో ఉన్నా అని తెలుసుకొని బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చారననే విమర్శలు వెల్లువెత్తాయి. సోహైల్ ఈ విధంగా మోసం పూరిత ఆటలు అనడం సరి కాదని నెటిజన్లు అతనిపై ట్రోల్ చేస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన సోహైల్ ఓ మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా... నాపై ఇలాంటి ఆరోపణలు చేయటం వల్ల ఎంతో బాధపడ్డాను. నేను విజేత కాదని తెలిసి డబ్బులు తీసుకున్నాను అనడంలో ఏ మాత్రం నిజం లేదని సోహైల్ వివరించాడు. 25 లక్షలు అంటే ఎంతో పెద్ద మొత్తం అని, హౌస్ నుంచి ఆ డబ్బులు బయటకు తీసుకు రావడం పట్ల నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశాడు. ఎన్నో ఏళ్ల నుంచి పడిన కష్టం బిగ్ బాస్ హౌస్ లోకి రావడం ద్వారా ఫలితం దక్కిందని ఈ సందర్భంగా సోహైల్ తెలియజేశాడు.