ప్రభాస్ పెట్టిన ఫుడ్ కు అమితాబ్ కూడా ఫిదా..

Big B enjoys home-made delicacies by Prabhas on ‘Project K’ set. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భోజనానికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఫిదా అయ్యారు.

By Medi Samrat
Published on : 21 Feb 2022 1:11 PM IST

ప్రభాస్ పెట్టిన ఫుడ్ కు అమితాబ్ కూడా ఫిదా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భోజనానికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఫిదా అయ్యారు. ప్రభాస్ తో సినిమా అంటే ఖచ్చితంగా ఫుడ్ ఫెస్టివల్ అని ఇప్పటికే ఎంతో మంది సినిమా స్టార్స్ చెబుతూ వచ్చారు. తాజాగా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ తో కలిసి 'ప్రాజెక్ట్-కె' సినిమాలో కలిసి నటిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ లో షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ కు ప్రభాస్ భోజనాన్ని తీసుకుని వచ్చారు.

దీంతో అమితాబ్ ప్రభాస్‌ను ప్రశంసిస్తూ తన ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. సోమవారం (ఫిబ్రవరి 21) తన ట్విట్టర్‌లో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఆతిథ్యాన్ని పొగుడుతూ రాశారు. ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలపడమే కాకుండా.. ఎంతో రుచికరంగా ఉందని తెలిపారు. "T 4198 – 'Bahubali' Prabhas .. your generosity is beyond measure". "You bring me home-cooked food, beyond delicious .. you send me quantity beyond measure .. could have fed an Army .. the special cookies .. beyond scrumptious." అంటూ అమితాబ్ బచ్చన్ పోస్టు పెట్టారు.

అంతకు ముందు కూడా ప్రభాస్ పై అమితాబ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్ లాంటి నటుడితో నటించడం తనకు దక్కిన గౌరవం అని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్లతో అశ్వినీదత్ ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు. దీపిక పదుకొనే ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఓ ముఖ్యమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.


Next Story