మరో భారీ బడ్జెట్ సినిమాతో రానున్న బెల్లంకొండ

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

By Medi Samrat  Published on  23 July 2024 9:30 PM IST
మరో భారీ బడ్జెట్ సినిమాతో రానున్న బెల్లంకొండ

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా అతనికి సరైన హిట్ లేదు. ఛత్రపతి హిందీ రీమేక్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అక్కడ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రాన్ని మెగా బడ్జెట్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా BSS12 అనే టైటిల్ పెట్టారు.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సాయి శ్రీనివాస్ అడవిలోని గుడి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ ఫాంటసీ థ్రిల్లర్‌ తరహాలో ఈ సినిమా ఉండబోతుంది. 400 ఏళ్ల నాటి దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సుధీర్ బైరెడ్డి రచన మరియు దర్శకత్వం వహించనున్నారు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది.. 2025 సమ్మర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రముఖ భాషల్లో విడుదల కానుంది.

Next Story