బాలయ్య బోయపాటి సినిమా టైటిల్ ని అప్పుడు రివీల్ చేస్తారా?

BB3 Title Update. బాలయ్య బోయపాటి సినిమా BB3 వచ్చే నెల టైటిల్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నారు.

By Medi Samrat  Published on  9 Feb 2021 8:10 PM IST
Balai latest movie title update

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో BB3 ఒకటి. నందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఆడియెన్స్ లో అంచనాల డోస్ గట్టిగా పెరిగాయి.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రెండు పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే వున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా స్లోగా ఉంది. సినిమా సెట్స్ పైకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికి కూడా టైటిల్ ఎనౌన్స్ చేయలేదు. ఇక టైటిల్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా మోనార్క్ అనే టైటిల్ ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసినట్లు మిరియాల్లో అనేక రకాల కథనాలు వచ్చాయి. అభిమానులను ఆ గాసిప్స్ చాలా వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ గట్టిగానే వచ్చింది.అయితే ఆ రూమర్స్ కు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. టైటిల్ విషయంలో ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని దానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు.

ఇక కుదిరితే షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్న బోయపాటి కుదిరితే వచ్చే నెల టైటిల్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను సమ్మర్ లో మే 28న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.


Next Story