ముగిసిన బప్పి లాహిరి అంత్యక్రియలు

Bappi Lahiri’s last rites performed. బప్పి లాహిరి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. 69 ఏళ్ల బప్పి లాహిరి

By Medi Samrat  Published on  17 Feb 2022 8:48 AM GMT
ముగిసిన బప్పి లాహిరి అంత్యక్రియలు

బప్పి లాహిరి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. 69 ఏళ్ల బప్పి లాహిరి ముంబయిలోని ఆసుపత్రిలో ఫిబ్రవరి 15 రాత్రి తుది శ్వాస విడిచారు. మంగళవారం రాత్రి బప్పి మనందరినీ విడిచిపెట్టి వెళ్లారని బప్పి లాహిరి అల్లుడు గోవింద్ బన్సాల్ వెల్లడించారు. గోవింద్.. బప్పి లాహిరి కుమార్తె రెమా లాహిరిని వివాహం చేసుకున్నారు.

"ఆయన మూడు వారాల క్రితం ఆసుపత్రిలో చేరాడు.. ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చాడు. గత రాత్రి 8:30-9 గంటల సమయంలో డిన్నర్ చేసాడు. రాత్రి భోజనం చేసిన అరగంటలో అతనికి గుండెపోటు వచ్చింది. ఆయన పల్స్ రేటు తక్కువగా ఉంది, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఇక లేరని వైద్యులు 11:44కి ప్రకటించారు "అని గోవింద్ బన్సాల్ చెప్పారు. బప్పి లాహిరి పాటలకు భారతదేశమంతటా ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో మంది ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.

ఫిబ్రవరి 17న బప్పి లాహిరి అంత్యక్రియలు విలే పార్లే శ్మశానవాటికలో నిర్వహించారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితుల సమక్షంలో ఆయన చివరి ప్రయాణం సాగింది. ఆయనను కడసారి చూసుకోడానికి పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. ఆయన అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొనడం కోసం పలు ప్రాంతాల నుండి అభిమానులు వచ్చారు. బప్పి లాహిరి పార్థివ దేహాన్ని అతని జుహు ఇంటి నుండి ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికకు తీసుకెళ్లారు.Next Story
Share it