నేపాలి పాపను ద‌త్త‌త తీసుకున్న బండ్ల గ‌ణేష్‌.. అందుకేనటా.!

Bandla Ganesh who adopted a Nepali girl. తాజాగా బండ్ల గణేష్‌.. ఓ నెపాలీ చిన్నారిని దత్తత తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాను నేపాలీ పాపను పెంచుకుంటున్నానని బండ్ల తెలిపాడు.

By అంజి  Published on  28 Nov 2021 5:42 AM GMT
నేపాలి పాపను ద‌త్త‌త తీసుకున్న బండ్ల గ‌ణేష్‌.. అందుకేనటా.!

సినిమా ఇండస్ట్రీలో కమెడియన్‌ ప్రస్తానం మొదలు పెట్టిన బండ్ల గణేష్‌ ఆ తర్వాత నిర్మాతగా తనదైన హవా చాటాడు. రాజకీయాల్లో కూడా తనదైన మార్క్‌ వేసిన బండ్ల గణేష్‌.. ఆ తర్వాత పలు కారణాల వల్ల వెనక్కు తగ్గారు. తాజాగా హీరోగా 'డేగల బాబ్జీ' సినిమాలో నటిస్తున్నాడు. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు వెంకట్‌ చంద్ర దర్శకత్వం చేశాడు. బండ్ల గణేష్‌ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ కూడా ఆసక్తిని పెంచింది. సినిమాలతో పాటు, సేవా కార్యక్రమాల్లోనూ బండ్ల గణేష్‌ అందరి మనుసులను గెల్చుకున్నారు. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో సోషల్‌ మీడియాలో సహాయం అడిగినవారందరికీ తన వంతు సాయం చేశాడు.

అయితే తాజాగా బండ్ల గణేష్‌.. ఓ నెపాలీ చిన్నారిని దత్తత తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాను నేపాలీ పాపను పెంచుకుంటున్నానని బండ్ల తెలిపాడు. " ఓసారి పాప ఏడుస్తుంటే నా భార్య చూసి వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి పాపకి ఫీడింగ్‌ ఏం పెడుతున్నారని అడిగింది. ఏం లేవని.. తన పాలు మాత్రమే ఇస్తున్నానని పాప తల్లి చెప్పింది. దీంతో పాపను మనం పెంచుకుందామని నా భార్య చెప్పింది" అని బండ్ల గణేష్‌ చెప్పారు. నేపాలీ పాప మా ఇంట్లో ఒక మెంబర్‌లా అయిపోయిందని అన్నారు. ఇకపోతే తనకు అనిపించే విచిత్రమైన విషయం ఏంటంటే.. అందరూ కుక్కలు, పిల్లులు పెంచుకుంటారు. వాటి కోసం చాలా ఖర్చు పెడుతుంటారు అని బండ్ల అన్నారు. తాను మాత్రం పాపను పెంచుకుంటున్నానని, పాపను మంచిగా పెంచి, గొప్పగా చదివించాలని అనుకుంటున్నానని బండ్ల గణేష్‌ తెలిపాడు.


Next Story
Share it