చిరంజీవి సార్‌ మీరు సూపర్‌: బండ్ల గణేష్‌ ట్వీట్‌

Bandla Ganesh tweeted an interesting about megastar Chiranjeevi. తాజాగా బండ్ల గణేష్‌ మెగాస్టార్‌ చిరంజీవికి సంబంధించి ఓ వీడియోను ట్వీటర్‌లో షేర్‌ చేశాడు. దానికి 'మీరు సూపర్‌ సార్‌' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

By అంజి  Published on  18 Nov 2021 11:43 AM GMT
చిరంజీవి సార్‌ మీరు సూపర్‌: బండ్ల గణేష్‌ ట్వీట్‌

బండ్ల గణేష్‌.. ఆనందం వచ్చినా, ఆయాసం వచ్చినా అస్సలు ఆపుకోడు. తన నేచర్‌ అలాంటిదంటూ బండ్ల గణేష్‌ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యామిలీ అంటే బండ్ల గణేష్‌కు ఎంతో ప్రేమ.. మరీ ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని. సమయం దొరికినప్పుడల్లా పవన్‌ కల్యాణ్‌ను, మెగా హీరోలపై పొగడ్తల వర్షం కురిపిస్తాడు. తాజాగా బండ్ల గణేష్‌ మెగాస్టార్‌ చిరంజీవికి సంబంధించి ఓ వీడియోను ట్వీటర్‌లో షేర్‌ చేశాడు. దానికి 'మీరు సూపర్‌ సార్‌' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. హైదరాబాద్‌ నగరంలోని అమీర్‌పేటలో యోదా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ప్రారంభ ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్న నటీనటులకు ఏదైనా సహాయం చేయాలని యోదా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ యాజమాన్యాన్ని చిరంజీవి కోరారు. దీంతో వెంటనే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో పాటు.. 24 క్రాఫ్ట్స్‌లలో పని చేసే వారికి తాము అందించే వైద్యం 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని డయాగ్నస్టిక్‌ అధినేత చెప్పారు. దీనికి అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బండ్ల గణేష్‌ ట్వీటర్‌లో షేర్‌ చేశారు. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతున్నానని బండ్ల గణేష్‌ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Next Story
Share it