నన్ను ఇబ్బంది పెట్టకండి : బండ్ల గణేష్

నిర్మాతగా బండ్ల గణేష్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూ ఉంది.

By -  Medi Samrat
Published on : 4 Nov 2025 8:48 PM IST

నన్ను ఇబ్బంది పెట్టకండి : బండ్ల గణేష్

నిర్మాతగా బండ్ల గణేష్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూ ఉంది. ఇటీవల జరిగిన పలు సినిమా వేడుకలకు బండ్ల గణేశ్ హాజరుకావడంతో, ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. తన రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై బండ్ల గణేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. బండ్ల గణేశ్ తనను ఇబ్బంది పెట్టవద్దని సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను ఏ సినిమానీ నిర్మించడం లేదని, ఎవరితో సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా నిర్మిస్తున్నట్లు వార్తలు రాస్తూ తనను ఇబ్బంది పెట్టవద్దని ఆయన కోరారు. తనకు అందరి మద్దతు, ప్రేమ ఉండాలని ఆకాంక్షించారు.

Next Story