తన రాజకీయ పార్టీపై.. ఒకప్పటి వీడియోలపై.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్
Bandla Ganesh Gives Clarity About Politics. బండ్ల గణేష్.. ఎప్పుడు చూసినా వార్తల్లోనే ఉంటారు. ఓ వైవు పవర్ స్టార్ పవన్
By Medi Samrat Published on 22 Nov 2020 5:46 PM IST
బండ్ల గణేష్.. ఎప్పుడు చూసినా వార్తల్లోనే ఉంటారు. ఓ వైవు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ అభిమాని అని చెప్పిన బండ్ల గణేష్.. అనూహ్యంగా ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. పార్టీ టికెట్ ఆశించినా నిరాశ ఎదురైంది. మరో వైపు తాను నమ్ముకున్న పార్టీ ఓటమి చెందడంతో ఇక రాజకీయాలు తనకు సెట్ అవ్వవని భావించారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని.. తాను రాజకీయాల నుండి తప్పుకుంటూ ఉన్నానని వెల్లడించారు.
ఇక తాను సినిమాల్లో నటించడం, నిర్మాతగా బాధ్యతలు చేపట్టడం వంటివి చేస్తానని.. అలాగే పౌల్ట్రీ బిజినెస్ మీద మరింత దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయబోతూ ఉన్నానని స్పష్టం చేశారు. కానీ ఇటీవలి కాలంలో బండ్ల గణేష్ ఇంకో పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. గతంలో రాజకీయాల్లో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలను ఇకపై చేయొద్దని కోరారు.
నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్ 🙏🙏🙏
— BANDLA GANESH. (@ganeshbandla) November 22, 2020
ప్రస్తుతం తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. 'నాకు ఏ రాజకీయ పార్టీతో, ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేశ్' అని ఆయన ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ అప్పుడెప్పుడో రాజకీయాల్లో ఉన్న వ్యాఖ్యలను ఇప్పుడు పోస్టు చేస్తూ ఉండడంతో అందరికీ క్లారిటీ కోసం.. బండ్ల గణేష్ ఇలాంటి పోస్టు పెట్టారు.