నోరు జారాను.. తప్పు చేశాను.. క్షమాపణలు కూడా చెప్పా : బండ్ల గణేష్

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఒకప్పుడు నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  31 Aug 2024 9:15 PM IST
నోరు జారాను.. తప్పు చేశాను.. క్షమాపణలు కూడా చెప్పా : బండ్ల గణేష్

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఒకప్పుడు నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే. ఓ అభిమాని ఫోన్ చేసినప్పుడు బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై విరుచుకుపడ్డారు. ఆ అంశంపై బండ్ల గణేష్ తాజాగా స్పందించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నోరు జారానని, తప్పు చేశానని అనిపించిందన్నారు. ఆ తర్వాత తామిద్దరం కలిసి మాట్లాడుకున్నామని.. ఆయనకు క్షమాపణలు కూడా చెప్పానన్నారు.

ఈ సారి పవన్ తో సినిమా చేస్తే 200 శాతం గబ్బర్‌సింగ్‌ స్థాయి చిత్రం చేయకపోతే నా పేరు బండ్ల గణేశ్‌ కాదన్నారు. ఇక నుండి మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నా. చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమాగా విజయాన్ని అందుకునే చిత్రాలు చేయాలని ఉందన్నారు. మా దర్శకుడు హరీశ్‌ శంకర్– బండ్ల గణేశ్‌ కాంబోలో ఓ సినిమా చేసే అవకాశం ఇవ్వమని మీడియా ద్వారా అడుగుతున్నానని.. అవకాశం ఇస్తే చరిత్రలో నిలిచిపోయే సినిమా చేస్తానన్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ తో తీసిన 'తీన్ మార్' సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నానని, కానీ మిస్ ఫైర్ అయిందన్నారు. ఈ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేస్తానన్నారు.

Next Story