రీ రిలీజ్‌కు సిద్ధమైన 'ఆదిత్య 369'

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్, క్లాసిక్ సినిమాలలో ఒకటైన ఆదిత్య 369 సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

By Medi Samrat  Published on  18 March 2025 9:15 PM IST
రీ రిలీజ్‌కు సిద్ధమైన ఆదిత్య 369

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్, క్లాసిక్ సినిమాలలో ఒకటైన ఆదిత్య 369 సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ అధికారిక X/ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఆదిత్య 369 ఏప్రిల్ 11న థియేటర్లలో 4K ఫార్మాట్‌లో తిరిగి విడుదల కానుంది.

ఈ చిత్రం అప్పట్లోనే సైన్స్ ఫిక్షన్, టైమ్-ట్రావెలింగ్ కాన్సెప్ట్‌కు మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రలో బాలకృష్ణ నటనకు అనేక ప్రశంసలు అందుకుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఆదిత్య 999 అనే టైటిల్‌తో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు కూడా దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story